46. ఇందరికి నభయంబు లిచ్చు చేయి
(iMdariki naBayaMbu liccu cEyi)

ప : ఇందరికి నభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి

చ : వెలలేని వేదములు వెదికి దెచ్చిన చేయి
చిలుకు గుబ్బలి కింద జేర్చు చేయి
కలికియగు భూకాంత గౌగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళ వాడిచేయి

చ : తనివోక బలిచేత దానమడిగిన చేయి
వొనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకు దెచ్చిన చేయి
యెనయ నాగేలు ధరియించు చేయి

చ : పురసతుల మానముల పొల్లసేసిన చేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరు వేంకటాచలాధీశుడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్ల దెలిపెడి చేయి


ఇందరికి నభయంబు లిచ్చు చేయి



Lyrics In English :

pa : iMdariki naBayaMbu liccu cEyi
kaMduvagu maMci baMgAru cEyi

ca : velalEni vEdamulu vediki deccina cEyi
ciluku gubbali kiMda jErcu cEyi
kalikiyagu BUkAMta gaugiliMcina cEyi
valanaina konagOLLa vADicEyi

ca : tanivOka balicEta dAnamaDigina cEyi
vonaraMga BUdAna mosagu cEyi
monasi jalanidhi yammu monaku deccina cEyi
yenaya nAgElu dhariyiMcu cEyi

ca : purasatula mAnamula pollasEsina cEyi
turagaMbu barapeDi doDDacEyi
tiru vEMkaTAcalAdhISuDai mOkShaMbu
teruvu prANulakella delipeDi cEyi