43. మతంగపర్వతమాడ
(mataMgaparvatamADa)

ప : మతంగపర్వతమాడ మాల్యవంతమునీడ
అతిశయిల్లిన పెద్దహనుమంతుడితడా

చ : యీతడా రామునిబంటు యీతడా వాయుసుతుడు
ఆతతబలాఢ్యు డందు రాత డితడా
సీతనువెదకివచ్చిచెప్పినయాత డితడా
ఘాతలలంకలోని రాక్షసవైరి యితడా

చ : అంజనాసుతు డీతడా అక్షమర్దను డీతడా
సంజీవినికొండ దెచ్చె సారె నితడా
భంజించె గాలనేమిని పంతమున నితడా
రంజితప్రతాపకపిరాజసఖుండితడా

చ : చిరంజీవి యితడా జితేంద్రియు డితడా
సురల కుపకారపుచుట్ట మీతడా
నిరతి శ్రీవెంకటాద్రిని విజనగరములో-
నరిది వరములిచ్చీ నందరికి నితడా




Lyrics In English:

pa : mataMgaparvatamADa mAlyavaMtamunIDa
atiSayillina peddahanumaMtuDitaDA

ca : yItaDA rAmunubaMTu yItaDA vAyusutuDu
AtatabalADhyu DaMdu rAta DitaDA
sItanuvedakivacciceppinayAta DitaDA
GAtalalaMkalOni rAkShasavairi yitaDA

ca : aMjanAsutu DItaDA akShamardanu DItaDA
saMjIvinikoMDa decce sAre nitaDA
BaMjiMce gAlanEmini paMtamuna nitaDA
raMjitapratApakapirAjasaKuMDitaDA

ca : ciraMjIvi yitaDA jitEMdriyu DitaDA
surala kupakArapucuTTa mItaDA
nirati SrIveMkaTAdrini vijanagaramulO-
naridi varamuliccI naMdariki nitaDA

42. మంగళము గోవిందునకు
(maMgaLamu gOviMdunaku)

ప : మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ

చ : ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజనాభున-
కాదికూర్మంబైన జగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు

చ : హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా-
కరునకును కాత్యాయనీనుతకలితనామునకు

చ : పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకును విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు






Lyrics In English:

pa : maMgaLamu gOviMdunaku jayamaMgaLamu garuDadhvajunakunu
maMgaLamu sarvAtmunaku dharmasvarUpunakU

ca : AdikininAdainadEvuna kacyutuna kaMBOjanABuna-
kAdikUrmaMbaina jagadAdhAramUrtikini
vEdarakShakunakunu saMtatavEdamArga vihArunaku bali-
BEdikini sAmAdigAnapriyavihArunaku

ca : hariki baramESvarunakunu SrIdharunakunu gAlAMtakunakunu
paramapuruShOttamunakunu bahubaMdhadUrunaku
suramunistOtrunaku dEvAsuragaNaSrEShThunaku karuNA-
karunakunu kAtyAyanInutakalitanAmunaku

ca : paMkajAsanavaradunaku BavapaMkavicCEdunaku Bavunaku
SaMkaruna kavyaktunaku nAScaryarUpunaku
vEMkaTAcalavallaBunakunu viSvamUrtiki nISvarunakunu
paMkajAkucakuMBakuMkuma paMkalOlunaku

41. కొలువైవున్నాడు వీడే
(koluvaivunnADu vIdE)

ప : కొలువైవున్నాడు వీడే గోవిందరాజు
కొలకొలనేగివచ్చే గోవిందరాజు

చ : గొడుగుల నీడల గోవిందరాజు
గుడిగొన్న పడగల గోవిందరాజు
కుడియెడమ కాంతల గోవిందరాజు
కొడిసాగే పవుజుల గోవిందరాజు

చ : గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు
గుప్పేటి వింజామరల గోవిందరాజు
కొప్పుపై చూగులతోడి గోవిందరాజు
కుప్పికటారములతోడి గోవిందరాజు

చ : గొరబుసింగారాల గోవిందరాజు
కురులు దువ్వించుకొని గోవిందరాజు
తిరుపతిలోనను తిరమై శ్రీవేంకటాద్రి
గురిసీ వరములెల్ల గోవిందరాజు




Lyrics In English:

pa : koluvaivunnADu vIDE gOviMdarAju
kolakolanEgivaccE gOviMdarAju

ca : goDugula nIDala gOviMdarAju
guDigonna paDagala gOviMdarAju
kuDiyeDama kAMtala gOviMdarAju
koDisAgE pavujula gOviMdarAju

ca : goppa goppa pUdaMDala gOviMdarAju
guppETi viMjAmarala gOviMdarAju
koppupai cUgulatODi gOviMdarAju
kuppikaTAramulatODi gOviMdarAju

ca : gorabusiMgArAla gOviMdarAju
kurulu duvviMcukoni gOviMdarAju
tirupatilOnanu tiramai SrIvEMkaTAdri
gurisI varamulella gOviMdarAju

40. అపరాధిని నేనైనాను
(aparAdhini nEnainAnu)

ప : అపరాధిని నేనైనాను
కృపగలవారికి కపటములేదు

చ : సనాతన అచ్యుత సర్వేశ్వర
అనాదికారణ అనంత
జనార్ధన అచల సకలలోకేశ్వర
నినుమరచి యున్నాడ నను తెలుపవయా

చ : పురాణపురుష పురుషోత్తమ
చరాచరాత్మక జగధీశ
పరాత్పర హరి బ్రహ్మాండనాయక
యిరవు నీవేయట యెరిగించగదే

చ : దేవోత్తమ శశి దినకరనయన
పావనచరిత పరమాత్మ
శ్రీవేంకటేశ జీవాంతరంగ
సేవకుడను బుద్ధి చెప్పగవలయు




Lyrics In English :

pa : aparAdhini nEnainAnu
kRpagalavAriki kapaTamulEdu

ca : sanAtana acyuta sarvESwara
anAdikAraNa anaMta
janArdhana acala sakalalOkESwara
ninumaraci yunnADa nanu telupavayA

ca : purANapurusha purushOttama
carAcarAtmaka jagadhISa
parAtpara hari brahmAMDanAyaka
yiravu nIvEyaTa yerigiMcagadE

ca : dEvOttama SaSi dinakaranayana
pAvanacarita paramAtma
SrIvEMkaTESa jIvAMtaraMga
sEvakuDanu buddhi ceppagavalayu