45. షోఢశకళానిధికి
(ShODhaSakaLAnidhiki)

ప : షోఢశకళానిధికి షోఢశోపచారములు
జాడతోడనిచ్చలును సమర్పయామి

చ : అలరువిశ్వాత్మకునకు ఆవాహనమిదే సర్వ
నిలయునకు ఆశనము నెమ్మినిదే
అలగంగాజనకునకు అర్ఘ్యపాద్యాచమనాలు
జలధిశాయికిని మజ్జనమిదే

చ : వరపీతాంబరునకు వస్త్రాలంకారమిదే
సరిశ్రీమంతునకు భూషణములివే
ధరణీధరునకు గంధపుష్పధూపములు
తిరమిదే కోటిసూర్యతేజునకు దీపము

చ : అమృతమధనునకు అదివోనైవేద్యము
గమిచంద్రనేత్రునకు కప్పురవిడెము
అమరిన శ్రీవేంకటాద్రి మీదిదేవునకు
తమితో ప్రదక్షిణాలు దండములుయివిగో


ShODhaSakaLAnidhik...


Lyrics In English :

pa : ShODhaSakaLAnidhiki ShODhaSOpacAramulu
jADatODaniccalunu samarpayAmi

ca : alaruviSwAtmakunaku AvAhanamidE sarwa
nilayunaku ASanamu nemminidE
alagaMgAjanakunaku arGyapAdyAcamanAlu
jaladhiSAyikini majjanamidE

ca : varapItAMbarunaku vastrAlaMkAramidE
sariSrImaMtunaku BUShaNamulivE
dharaNIdharunaku gaMdhapuShpadhUpamulu
tiramidE kOTisUryatEjunaku dIpamu

ca : amRtamadhanunaku adivOnaivEdyamu
gamicaMdranEtrunaku kappuraviDemu
amarina SrIvEMkaTAdri mIdidEvunaku
tamitO pradakShiNAlu daMDamuluyivigO

0 comments: