44. ఇహమేగాని యికపరమేగాని
(ihamEgAni yikaparamEgAni)

ప : ఇహమేగాని యికపరమేగాని
బహుళమై హరినీపై భక్తేచాలు

చ : యెందుజనించిననేమి యెచ్చోటనున్ననేమీ
కందువ నీదాస్యము కలుగుటేచాలు
అంది స్వర్గమేగాని అలనరకమేగానీ
అందపు నీనామము నాకబ్బుటేచాలు

చ : దొరయైనచాలు కడుదుచ్ఛపుబంటైనచాలు
కరగి నిన్నుతలంచ గలిగితేచాలు
పరులుమెచ్చినమేలు పమ్మిదూషించినమేలు
హరి నీసేవాపరుదౌటేచాలు

చ : యిలచదువులురాని యిటురాకమాననీ
తలపు నీపాదముల తగులుటేచాలు
యెలమి శ్రీవేంకటేశా యేలితివి నన్నునిట్టే
చలపట్టి నాకు నీశరణమేచాలు


ihamEgAni yikapara...


Lyrics In English :

pa : ihamEgAni yikaparamEgAni
bahuLamai harinIpai BaktEcAlu

ca : yeMdujaniMcinanEmi yeccOTanunnanEmI
kaMduva nIdAsyamu kaluguTEcAlu
aMdi swargamEgAni alanarakamEgAnI
aMdapu nInAmamu nAkabbuTEcAlu

ca : dorayainacAlu kaDuducCapubaMTainacAlu
karagi ninnutalaMca galigitEcAlu
parulumeccinamElu pammidUShiMcinamElu
hari nIsEvAparudauTEcAlu

ca : yilacaduvulurAni yiTurAkamAnanI
talapu nIpAdamula taguluTEcAlu
yelami SrIvEMkaTESA yElitivi nannuniTTE
calapaTTi nAku nISaraNamEcAlu

0 comments: