39. వేరొకచోటలేడు వీడివో హరి(vErokacOTalEDu vIDivO hari)
వీరిడియై చేరువనే వీడివో హరి
చ : మునుకొని వెదికితే ముక్కుమార్పు గాలికొన
వెనవెనక దిరిగీ వీడివో హరి
పెనగి వెదకబోతె పెడచెవుల మంత్రమై
వినవచ్చి మాటలలో వీడివో హరి
చ : శోధించి వెదకితేను చూపులకొనలనే
వీధులనెందు జూచిన వీడివో హరి
ఆదిగొని వెదకితే నట్టే నాలికకొన
వేదమై నిలిచినాడు వీడివో హరి
చ : తెలిసి వెదకబోతె దేహపుటంతరాత్మయై
వెలుపల లోపలను వీడివో హరి
చెలగి శ్రీవేంకటాద్రి చేకొని మమ్ము రక్షించ
వెలసె నిందరూజూడ విడివో హరి
| వేరొకచోటలేడు వీడివో హరి |
Lyrics In English :
pa : vErokacOTalEDu vIDivO hari
vIriDiyai cEruvanE vIDivO hari
ca : munukoni vedikitE mukkumArpu gAlikona
venavenaka dirigI vIDivO hari
penagi vedakabOte peDacevula maMtramai
vinavacci mATalalO vIDivO hari
ca : SOdhiMci vedakitEnu cUpulakonalanE
vIdhulaneMdu jUcina vIDivO hari
Adigoni vedakitE naTTE nAlikakona
vEdamai nilicinADu vIDivO hari
ca : telisi vedakabOte dEhapuTaMtarAtmayai
velupala lOpalanu vIDivO hari
celagi SrIvEMkaTAdri cEkoni mammu rakShiMca
velase niMdarUjUDa viDivO hari
