35. దేవశిఖామణివి దిష్టదైవమవు
(dEvaSiKAmaNivi diShTadaivamavu)

ప : దేవశిఖామణివి దిష్టదైవమవు నీవు
ఈవల నీబంట నాకు నెదురింక ఏది

చ : కామధేనువు పిదుకగల కోరికెలివెల్ల
కామధేనువులు పెక్కుగాచే కృష్ణుడవట
కామించి నీ బంటనట కమ్మినిన్ను దలచితి
ఏమి మాకు కడమయ్యా ఇందిరా రమణ

చ : ఎంచ కల్పవృక్షమును ఇచ్చు సిరులెల్లాను
మించి కల్పవృక్షముల నీడలా కృష్ణుడవట
అంచల నీ బంటనట ఆత్మలొ నిను నమ్మితి
వంచించ కడమయేది వసుధాధీశ

చ : తగనొక్క చింతామణి తలచినట్లచేసు
మిగుల కౌస్తుభమణి మించినా కృష్ణుడవట
పగటు శ్రీవేంకటేశ భక్తుడ నీకట నేను
జగములో కొరతేది జగదేకవిభుడ

Listen To Audio

దేవశిఖామణివి దిష్టదైవమవు



Lyrics In English:

pa : dEvaSiKAmaNivi diShTadaivamavu nIvu
Ivala nIbaMTa nAku neduriMka Edi

ca : kAmadhEnuvu pidukagala kOrikelivella
kAmadhEnuvulu pekkugAcE kRuShNuDavaTa
kAmiMci nI baMTanaTa kammininnu dalaciti
Emi mAku kaDamayyA iMdirA ramaNa

ca : eMca kalpavRukShamunu iccu sirulellAnu
miMci kalpavRukShamula nIDalA kRuShNuDavaTa
aMcala nI baMTanaTa Atmalo ninu nammiti
vaMciMca kaDamayEdi vasudhAdhISa

ca : taganokka ciMtAmaNi talacinaTlacEsu
migula kaustuBamaNi miMcinA kRuShNuDavaTa
pagaTu SrIvEMkaTESa BaktuDa nIkaTa nEnu
jagamulO koratEdi jagadEkaviBuDa

34. సకల జీవులకెల్ల సంజీవి
(sakala jIvulakella)


ప : సకల జీవులకెల్ల సంజీవి యీమందు
వెకలులై యిందరు సేవించరో యీమందు

చ : మూడు లోకము లొక్కట ముంచి పెరిగినది
పోడిమి నల్లని కాంతి బొదలినది
పేడుక కొమ్ములు నాల్గు పెనచి చేయివారినది
నాడే శేషగిరిమీద నాటుకొన్న మందు

చ : పడిగెలు వేయింటి పాము గాచుకున్నది
కడు వేదశాస్త్రముల గబ్బు వేసేది
యెడయక వొకకాంత యెక్కుక వుండినది
కడలేని యంజనాద్రి గారుడపు మందు

చ : బలు శంఖు జక్రముల బదనికెలున్నది
తలచిన వారికెల్ల తత్త్వమైనది
అలరిన బ్రహ్మరుద్రాదుల బుట్టించినది
వెలుగు తోడుత శ్రీవేంకటాద్రి మందు



Lyrics In English:



pa : sakala jIvulakella saMjIvi yImaMdu
vekalulai yiMdaru sEviMcarO yImaMdu

ca : mUDu lOkamu lokkaTa muMci periginadi
pODimi nallani kAMti bodalinadi
pEDuka kommulu nAlgu penaci cEyivArinadi
nADE SEShagirimIda nATukonna maMdu

ca : paDigelu vEyiMTi pAmu gAcukunnadi
kaDu vEdaSAstramula gabbu vEsEdi
yeDayaka vokakAMta yekkuka vuMDinadi
kaDalEni yaMjanAdri gAruDapu maMdu

ca : balu SaMKu jakramula badanikelunnadi
talacina vArikella tattvamainadi
alarina brahmarudrAdula buTTiMcinadi
velugu tODuta SrIvEMkaTAdri maMdu

33. ఏమని వర్ణించునుకో ఇంక
(Emani varNimcunukO)

ప : ఏమని వర్ణించునుకో ఇంక పురాణములెల్ల
వేమారు కొత్తలాయె విశ్వలోకపతికి

చ : పాలజలనిధిలోన పలుమారు తేలగాను
నీలవర్ణమెల్లబోయి నిండు తెలుపైనట్టు
మేలిమి కప్పురకాపు మేననిండ నించగాను
పోలికె వేరొక్కటాయె పురుషోత్తమునికీ

చ : వేడుక కాళిందిలోన వేమారు నీదగాను
ఆడనే కమ్మర నలుపైనట్టు
తోడనే తట్టుపునుగు తొప్పదోగ నించగాను
జాడ వేరొక్కటాయె సర్వేశ్వరునికీ

చ : అలమేలుమంగ నుఱమందునే నిలుపగాను
అలరి బంగారు వర్ణమైనట్టు
నలుగడ సొమ్ములతో నానావర్ణములు
నిలిచె శ్రీవేంకటనిలయమూరితికీ

Lyrics In English:

pa : Emani varNimcunukO inka purANamulella
vEmAru kottalAye viSwalOkapatiki

ca : pAlajalanidhilOna palumAru tElagAnu
nIlavarNamellabOyi nimDu telupainaTTu
mElimi kappurakApu mEnanimDa nimcagAnu
pOlike vErokkaTAye purushOttamunikI

ca : vEDuka kALimdilOna vEmAru nIdagAnu
ADanE kammara nalupainaTTu
tODanE taTTupunugu toppadOga nimcagAnu
jADa vErokkaTAye sarvESwarunikI

ca : alamElumanga nu~ramandunE nilupagAnu
alari bamgAru varNamainaTTu
nalugaDa sommulatO nAnAvarNamulu
nilice SrIvEmkaTanilayamUritikI

32. తిరుమలగిరిరాయ దేవరావుత్తరాయ
(tirumalagirirAya dEvarAvuttarAya)


ప : తిరుమలగిరిరాయ దేవరావుత్తరాయ
సురతబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ

చ : సిరులసింగారరాయ చెలువపుతిమ్మరాయ
సరసవైభవరాయ సకలవినోదరాయ
వరవసంతములరాయ వనితలవిటరాయ
గురుతైన తేగరాయ కొండలకోనేటిరాయ

చ : గొల్లెతలవుద్దండరాయ గోపాలకృష్ణరాయ
చల్లువెదజాణరాయ చల్లబరిమళరాయ
చెల్లుబడిధర్మరాయ చెప్పరానివలరాయ
కొల్లలైన భోగరాయ కొండలకోనేటిరాయ

చ : సామసంగీతరాయ సర్వమోహనరాయ
ధామవైకుంఠరాయ దైత్యవిభాళరాయ
కామించి నిన్ను గోరితే గరుణించితివి నన్ను
శ్రీమంతుడ నీకు జయ శ్రీవేంకటరాయ

Listen To Audio

తిరుమలగిరిరాయ దేవరావుత్తరాయ


Lyrics in English Text :

pa : tirumalagirirAya dEvarAvuttarAya
suratabinnANarAya suguNakOnETirAya

ca : sirulasiMgArarAya celuvaputimmarAya
sarasavaiBavarAya sakalavinOdarAya
varavasaMtamularAya vanitalaviTarAya
gurutaina tEgarAya koMDalakOnETirAya

ca : golletalavuddaMDarAya gOpAlakRuShNarAya
calluvedajANarAya callabarimaLarAya
cellubaDidharmarAya cepparAnivalarAya
kollalaina BOgarAya koMDalakOnETirAya

ca : sAmasaMgItarAya sarvamOhanarAya
dhAmavaikuMTharAya daityaviBALarAya
kAmiMci ninnu gOritE garuNiMcitivi nannu
SrImaMtuDa nIku jaya SrIvEMkaTarAya

31. నిత్యాత్ముడై యుండి నిత్యుడై
(nityAtmuDai yuMDi nityuDai)


ప : నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు సం-
స్తుత్యుడీ తిరువేంకటాద్రివిభుడు

చ : ఏమూర్తి లోకంబులెల్ల నేలెడునాత-
డేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడునాత-
డేమూర్తి నిజమోక్షమియ్య జాలెడునాత-
డేమూర్తి లోకైకహితుడు
యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు
యేమూర్తి త్రైమూర్తు లేకమైనయాత-
డేమూర్తి సర్వాత్ము డేమూర్తి పరమాత్ము-
డామూర్తి తిరువేంకటాద్రివిభుడు

చ : యేదేవుదేహమున నిన్నియును జన్మించె
నేదేవుదేహమున నిన్నియును నణగె మరి
యేదేవువిగ్రహం బీసకల మింతయును
యేదేవునేత్రంబు లినచంద్రులు
యేదేవు డీజీవులిన్నింటిలో నుండు
నేదేవుచైతన్య మిన్నిటికి నాధార-
మేదేవు డవ్యక్తు డేదేవు డద్వంద్వదు-
డాదేవుడీ వేంకటాద్రివిభుడు

చ : యేవేల్పుపాదయుగ మిలయునాకాశంబు
యేవేల్పుపాదకేశాంతం బనంతంబు
యేవేల్పునిశ్వాస మీమహామారుతము
యేవేల్పునిజదాసు లీపుణ్యులు
యేవేల్పు సర్వేశు డేవేల్పు పరమేశు-
డేవేల్పు భువనైకహితమనోభావకుడు
యేవేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కడుఘనము
ఆవేల్పు తిరువేంకటాద్రివిభుడు



Lyrics In English:

pa : nityAtmuDai yuMDi nityuDai velugoMdu
satyAtmuDai yuMDi satyamai tAnuMDu
pratyakShamai yuMDi brahmamai yuMDu saM-
stutyuDI tiruvEMkaTAdriviBuDu

ca : EmUrti lOkaMbulella nEleDunAta-
DEmUrti brahmAdulella vedakeDunAta-
DEmUrti nijamOkShamiyya jAleDunAta-
DEmUrti lOkaikahituDu
yEmUrti nijamUrti yEmUrtiyunu gADu
yEmUrti traimUrtu lEkamainayAta-
DEmUrti sarvAtmu DEmUrti paramAtmu-
DAmUrti tiruvEMkaTAdriviBuDu

ca : yEdEvudEhamuna ninniyunu janmiMce
nEdEvudEhamuna ninniyunu naNage mari
yEdEvuvigrahaM bIsakala miMtayunu
yEdEvunEtraMbu linacaMdrulu
yEdEvu DIjIvulinniMTilO nuMDu
nEdEvucaitanya minniTiki nAdhAra-
mEdEvu Davyaktu DEdEvu DadvaMdvadu-
DAdEvuDI vEMkaTAdriviBuDu

ca : yEvElpupAdayuga milayunAkASaMbu
yEvElpupAdakESAMtaM banaMtaMbu
yEvElpuniSvAsa mImahAmArutamu
yEvElpunijadAsu lIpuNyulu
yEvElpu sarvESu DEvElpu paramESu-
DEvElpu BuvanaikahitamanOBAvakuDu
yEvElpu kaDusUkShma mEvElpu kaDuGanamu
AvElpu tiruvEMkaTAdriviBuDu