38. వున్నమాటలికనేల ఓ దేవా
(vunnamATalikanEla O dEvA)

ప : వున్నమాటలికనేల ఓ దేవా
యెన్నటికిదే మాట యింకాయింకాను

చ : కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము
యింతలో రెండు గలవాయేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటి బొమ్మను నేను
చెంతగాచుట నీ పని సేవసేయ నా పని

చ : నేనపరాధి నయ్యేది నీవూహించుకొనేది
తేనెపాలు రెండు నేలయేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
అని చింతించేనందుల కపకీర్తి అనుచో

చ : మెదలే నాయధమము నీఘనత యెంచిగావు
యిదియే నావిన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిట నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యికనూ

వున్నమాటలికనేల ఓ దేవా



Lyrics In English:

pa : vunnamATalikanEla O dEvA
yennaTikidE mATa yiMkAyiMkAnu

ca : koMta nA karmaPalamu koMta nI rakShakatvamu
yiMtalO reMDu galavAyEmO dEvA
aMtaryAmivi nIvu ADETi bommanu nEnu
ceMtagAcuTa nI pani sEvasEya nA pani

ca : nEnaparAdhi nayyEdi nIvUhiMcukonEdi
tEnepAlu reMDu nElayEmO dEvA
mAnaka yiTlayitE nI mahimaku gurutEdi
ani ciMtiMcEnaMdula kapakIrti anucO

ca : medalE nAyadhamamu nIGanata yeMcigAvu
yidiyE nAvinnapamu yEmO dEvA
yeduTa SrIvEMkaTESa yinniTa nI baMTu baMTa
padivElu nA nErAlu paTTakumI yikanU

0 comments: