28. విడువరాదెంతైనా వెర్రివాడనైనా(viDuvarAdeMtainA verrivADanainA)
ప : విడువరాదెంతైనా వెర్రివాడనైనా నీకు
కడవారు నవ్వకుండ కాచుకో నన్నునూ
చ : జ్ఙానము నేనెరగ అజ్ఙానము నేనెరగ
మానను విషయములూ మరిగియెంతైనా
నీనామము నొడిగి నీదాసుడననుకొందు
దీనికే వహించుకుని దిద్దుకోనన్నునూ
చ : అకర్మము నెరగను సుకర్మము నెరగను
ప్రకట సంసారముపై పాటు మానను
ఒకపనివాడనై పూని ముద్రధారినైతి
మొకమోడి నిందుకే గోముననేలు నన్నునూ
చ : వెనక గానను ముందువిచారించి కానను
నినుపై దేహధారినై నీకు మొక్కేను
ఘనుడ శ్రీవేంకటేశా కన్నులెదుట పడితి
కనిపో విడువరాదు కరుణించు నన్నునూ
Listen To Audio
Lyrics In English :
pa : viDuvarAdeMtainA verrivADanainA nIku
kaDavAru navvakuMDa kAcukO nannunU
ca : j~gAnamu nEneraga aj~gAnamu nEneraga
mAnanu viShayamulU marigiyeMtainA
nInAmamu noDigi nIdAsuDananukoMdu
dInikE vahiMcukuni diddukOnannunU
ca : akarmamu neraganu sukarmamu neraganu
prakaTa saMsAramupai pATu mAnanu
okapanivADanai pUni mudradhArinaiti
mokamODi niMdukE gOmunanElu nannunU
ca : venaka gAnanu muMduvicAriMci kAnanu
ninupai dEhadhArinai nIku mokkEnu
GanuDa SrIvEMkaTESA kannuleduTa paDiti
kanipO viDuvarAdu karuNiMcu nannunU

0 comments:
Post a Comment