27. అనాది జగములు
(anAdi jagamulu)


ప : అనాది జగములు అనాది దేవుడు
వినోదములుబడి విసుగదు మాయా

చ : పుట్టేటి జీవులు పోయిన జీవులు
పుట్టిన జీవులు ఉన్నారు
చుట్టేరు దినములు సూర్యచంద్రాదులు
తెట్టెతెరవుననే తెగెడు కాలము

చ : కలడు బ్రహ్మయును కలడింద్రాదులు
కలవనేకములు కార్యములు
ఫలభొగంబులు పైపైనున్నవి
కలియుకర్మము గడవగలేదు

చ : శ్రీవేంకటేశుడు చిత్తములో వీడె
భావములోపల భక్తియిదే
భావించి బ్రతుకుట ప్రపన్నులువీరిదే
ఏవలజూచిన ఇహమే పరము




Lyrics In English :

pa : anAdi jagamulu anAdi dEvuDu
vinOdamulubaDi visugadu mAyA

ca : puTTETi jIvulu pOyina jIvulu
puTTina jIvulu unnAru
cuTTEru dinamulu sUryacaMdrAdulu
teTTeteravunanE tegeDu kAlamu

ca : kalaDu brahmayunu kalaDiMdrAdulu
kalavanEkamulu kAryamulu
PalaBogaMbulu paipainunnavi
kaliyukarmamu gaDavagalEdu

ca : SrIvEMkaTESuDu cittamulO vIDe
BAvamulOpala BaktiyidE
BAviMci bratukuTa prapannuluvIridE
EvalajUcina ihamE paramu

0 comments: