26. సిన్నెకతేవే సెలవునీత

ప : సిన్నెకతేవే సెలవునీత
వెన్నలు సవిగొను వెన్నునిత

చ : మూటల్ మాటల్ మూరల్ బారల్
పాటల్ సదివే పాపలుతా
పేటల్ వీపుల్ వేలుపు గుడుపుల్
తేటలు మరిగిన దేవునితా

చ : వాకుల్ చీకుల్ వాదుల్ పోదుల్
సోకపు తొల్లేటి సుద్దులుతా
పాకుల లోకుల్ పొగడగ మనిపేడి
కౌకిగరులతల కృష్ణునితా

చ : మొగ్గుల్ సుగ్గుల్ బాగుల్ సోరీగ
దగ్గరవెరపోగు తపసులుతా
సిగ్గుల్ బాపెడి శ్రీవేంకటపతి
నగ్గపు సొమ్ముల ఆతనితా

0 comments: