25. వలపులు వలపులు వయ్యాళి

ప : వలపులు వలపులు వయ్యాళి
చలమరి మరుడును సమేళి

చ : నెలత మోమునకు నీ కనుచూపులు
నిలువున ముత్యపు నివాళి
కొలదికి మీరిన గురుకుచములకును
తొలకు నీ మనసు దువ్వాళి

చ : వనిత నిండుజవ్వన గర్వమునకు
ఘనమగు నీ రతి కరాళి
వెనకముందరల వెలది మేనికిని
పెనగు గోరికొన పిసాళి

చ : పడతి కోరికల భావంబునకును
కడు కడు నీతమి గయ్యాళి
చిడిముడి మగువకు శ్రీవేంకటపతి
విడువని కూటపు విరాళి


Listen to Audio

0 comments: