23. అప్పులేని సంసారమైన
ప : అప్పులేని సంసారమైన పాటే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన చాలు
చ : కంతలేని గుడిసొక్క గంపంతైన చాలు
చింతలేని అంబలొక్క చేరెడు చాలు
జంతగాని తరుణి ఏ జాతైననదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు
చ : తిట్టులేని బ్రతుకొక్క దినమైననదె చాలు
ముట్టులేని కూడొక్క ముద్దే చాలు
గుట్టుచెడి మనుకంటె కొంచెపు మేలైన చాలు
వట్టి జాలిబడుకంటే వచ్చినంతే చాలు
చ : లంపట పడనీ మేలు లవలేశమే చాలు
ఱొంపి కంబమౌకంటె ఱోయుటే చాలు
ఱంపపు కోరికకంటె రతి శ్రీవేంకటపతి
పంపున నాతని చేరే భవమే చాలు
తప్పులేని జీతమొక్క తారమైన చాలు
చ : కంతలేని గుడిసొక్క గంపంతైన చాలు
చింతలేని అంబలొక్క చేరెడు చాలు
జంతగాని తరుణి ఏ జాతైననదె చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలు
చ : తిట్టులేని బ్రతుకొక్క దినమైననదె చాలు
ముట్టులేని కూడొక్క ముద్దే చాలు
గుట్టుచెడి మనుకంటె కొంచెపు మేలైన చాలు
వట్టి జాలిబడుకంటే వచ్చినంతే చాలు
చ : లంపట పడనీ మేలు లవలేశమే చాలు
ఱొంపి కంబమౌకంటె ఱోయుటే చాలు
ఱంపపు కోరికకంటె రతి శ్రీవేంకటపతి
పంపున నాతని చేరే భవమే చాలు
Listen to Audio

0 comments:
Post a Comment