22. సహజ వైష్ణవాచారవర్తనుల
ప : సహజ వైష్ణవాచారవర్తనుల
సహవాసమే మాసంధ్య
చ : అతిశయముగ శ్రీహరి సంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురత మెరసిన సంధ్య
చ : పరమభాగవత పదసేవనయే
సరవి నెన్న మాసంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ వే
సహవాసమే మాసంధ్య
చ : అతిశయముగ శ్రీహరి సంకీర్తన
సతతంబును మాసంధ్య
మతి రామానుజమతమే మాకును
చతురత మెరసిన సంధ్య
చ : పరమభాగవత పదసేవనయే
సరవి నెన్న మాసంధ్య
సిరివరు మహిమలు చెలువొందగ వే
సరక వినుటె మాసంధ్య
చ : మంతుకెక్క తిరుమంత్ర పఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుడు వేంకటగిరిరాయని
సంతర్పణమే మాసంధ్య
చ : మంతుకెక్క తిరుమంత్ర పఠనమే
సంతతమును మాసంధ్య
కంతుగురుడు వేంకటగిరిరాయని
సంతర్పణమే మాసంధ్య
Listen To Audio

0 comments:
Post a Comment