21. కదిరి నృసింహుడు కంభమున...

ప : కదిరి నృసింహుడు కంభమున వెడలే
విదితముగా సేవించరో మునులు

చ : ఫాలలోచనము భయదోగ్ర ముఖము
జ్వాలామయ కేశరములునూ
కాలరౌద్ర సంఘటిత దంతములు
హేలాగతి ధరియించుక నిలిచే

చ : ముడివడు బొమ్మలు ముంచిన ఊర్పులు
గడగడ నదరెడి కటములునూ
నిడుత నాలుకయు నిక్కు కర్ణములు
నడియాలపు రూపై వెలసే

చ : సకలాయుధములు సహస్ర భుజములు
వికట నఖంబులు వెసబూనీ
వెకలియగుచు శ్రీవేంకటేశ్వరుడు
ప్రకటపు దుష్టుల భంజించేనిదివో

2 comments:

Sravan Kumar DVN said...

bavundi kriti.
-Sravan

Anonymous said...
This post has been removed by a blog administrator.