20. మేలుకొనవే నీలమేఘవర్ణుడా
ప : మేలుకొనవే నీలమేఘవర్ణుడా
వేళ తప్పకుండాను శ్రీవేంకటేశుడా
చ : మంచముపై నిద్రదేర మల్లెల వేసేరు
ముంచి తుఱుము ముడువ మొల్లల వేసేరు
కంచము పొద్దారగించ కలువల వేసేరు
పింఛపు చిక్కుదేర సంపెంగల వేసేరు
చ : కలసిన కాకదేర గన్నేరుల వేసేరు
వలపులు రేగీ విరజాజుల వేసేరు
చలువగా వాడుదేర జాజుల వేసేరు
పులకించ గురువింద పూవుల వేసేరు
చ : తమిరేగ గోపికలు తామరల వేసేరు
చెమటార మంచి తులసిని వేసేరు
అమర శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
మమతల పన్నీటి చేమంతుల వేసేరు

1 comments:
Hi prasanth awesome song!! looks like the one sung by priya sisters.. not sure but awesome...
Post a Comment