18. శోధించిరిదియే సురలును...
ప : శోధించిరిదియే సురలును మునులును
ఆదికి అనాది హరినామం
చ : అరిది వేదశాస్త్రార్ధ సంగ్రహము
అరయగ నొకటే హరినామం
దురితహరము భవదుఖః నాశనము
అరిభయంకరము హరినామం
చ : సకల పుణ్యఫల సారవిహారము
అకలంకము శ్రీ హరినామం
ప్రకటము సులభము పరమ పావనము
అకుటిలమిది శ్రీ హరినామం
చ : కందువ సదరము కైవల్యపదము
అందరికిదియే హరినామం
ఎందును శ్రీవేంకటేశ్వరు కరుణకు
అందుకోలైన హరినామం
ఆదికి అనాది హరినామం
చ : అరిది వేదశాస్త్రార్ధ సంగ్రహము
అరయగ నొకటే హరినామం
దురితహరము భవదుఖః నాశనము
అరిభయంకరము హరినామం
చ : సకల పుణ్యఫల సారవిహారము
అకలంకము శ్రీ హరినామం
ప్రకటము సులభము పరమ పావనము
అకుటిలమిది శ్రీ హరినామం
చ : కందువ సదరము కైవల్యపదము
అందరికిదియే హరినామం
ఎందును శ్రీవేంకటేశ్వరు కరుణకు
అందుకోలైన హరినామం
Listen to Audio

0 comments:
Post a Comment