17. సేవే భావే శ్రీ బృందం

ప : సేవే భావే శ్రీ బృందం
శ్రీవల్లభ చింతానందం

చ : పటుకుతర్కనక భంజనదీక్షం
కుటిల దురితహర గుణదక్షం
ఘటిత మహాఫల కల్పకవృక్షం
చటుల రామానుజ శమదమవీక్షం

చ : కృద్ధమృషామత కుంఠనకుంతం
భౌద్ధాంధకార భాస్వంతం
శుద్ధచేదమణి సుశరస్వంతం
సిద్ధాంతీకృత చిన్మయకాంతం

చ : చార్వాకగహన ఛంఢకుఠారం
సర్వాపశాస్త్ర శతధారం
నిర్వికారగుణ నిబిడ శ్రీవేంకట
ఉర్వీధర సంయోగ గభీరం


Listen to Audio

0 comments: