4. నెలమూడు శోభనాలు నీకు...
ప : నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ : రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు
ప్రేమపు మీయిద్దరికి పేరుబలమొకటే
చ : హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచెదాను నీవు కరియానవు
సరి జలధిశాయి జలధికన్యవు నీవు
వెరసి మీయిద్దరికి పేరుబలమొకటే
చ : జలజ నాభుడతడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నెలమెదాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె
పిలిచి పేరుచెప్పే పేరుబలమొకటే
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ : రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు
ప్రేమపు మీయిద్దరికి పేరుబలమొకటే
చ : హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచెదాను నీవు కరియానవు
సరి జలధిశాయి జలధికన్యవు నీవు
వెరసి మీయిద్దరికి పేరుబలమొకటే
చ : జలజ నాభుడతడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నెలమెదాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె
పిలిచి పేరుచెప్పే పేరుబలమొకటే
Listen to Audio

0 comments:
Post a Comment