3. నమో నమో దానవవినాశ చక్రమా..
ప : నమో నమో దానవవినాశ చక్రమా
సమర విజయమైన సర్వేశు చక్రమా
చ : అట్టె పదారు భుజాల అమరిన చక్రమా
పట్టిన ఆయుధమ్ముల బలు చక్రమా
నెట్టన మూడుకన్నుల నిలచిన చక్రమా
రట్టుగా మన్నించవే మెరయుచు చక్రమా
చ : ఆరయ నారుకోణాల నమరిన చక్రమా
ధారలు వేయింటి తోడి తగు చక్రమా
ఆరక మీదికి వెళ్ళే అగ్ని శిఖల చక్రమా
గారవాన నీదాసుల కావవే చక్రమా
చ : రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా
దివిజ సేవితమైన దివ్య చక్రమా
తవిలి శ్రీ వేంకటేశు దక్షిణకర చక్రమా
ఇవల నీదాసులము యేలుకోవే చక్రమా
సమర విజయమైన సర్వేశు చక్రమా
చ : అట్టె పదారు భుజాల అమరిన చక్రమా
పట్టిన ఆయుధమ్ముల బలు చక్రమా
నెట్టన మూడుకన్నుల నిలచిన చక్రమా
రట్టుగా మన్నించవే మెరయుచు చక్రమా
చ : ఆరయ నారుకోణాల నమరిన చక్రమా
ధారలు వేయింటి తోడి తగు చక్రమా
ఆరక మీదికి వెళ్ళే అగ్ని శిఖల చక్రమా
గారవాన నీదాసుల కావవే చక్రమా
చ : రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా
దివిజ సేవితమైన దివ్య చక్రమా
తవిలి శ్రీ వేంకటేశు దక్షిణకర చక్రమా
ఇవల నీదాసులము యేలుకోవే చక్రమా
Listen to Audio

0 comments:
Post a Comment