10. కలలోని సుఖమే...

ప : కలలోని సుఖమే కలియుగమా వెన్న
కలిలో ఎక్కడిదె కలియుగమా

చ : కడిగడి గండమై కాలము గడపేవు
కడుగ గడుగ రొంపి కలియుగమా
బడలికె వాపవు పరమేదొ చూపవు
గడిచి ఇటు నీవు కలియుగమా

చ : కరపేవు కరతలే మరపేవు మమతలే
కరకర విడువవు కలియుగమా
తెరచీర మరగింతే తెరువేల మూసేవు
గరుసేల దాటేవో కలియుగమా

చ : కానిదె మెచ్చేవు కపటాలే యిచ్చేవు
కానీలే కానీలే కలియుగమా
పైనిదే వేంకటపతి దాసులుండగ
కానవ నీవిదేమి కలియుగమా


Listen to Audio

0 comments: