5. వొరపో మెరుపో వొయ్యారమో...
ప : వొరపో మెరుపో వొయ్యారమో నీకు
వెరుతుమయ్యా గోవిందుడా
చ : కపటమో నిజమో కరుణయో కోపమో
ఉపచారమో ఉపతాపమో
నిపుణత తనపై నెయ్యమే సేసేవు
విపరీతము గోవిందుడా
చ : ననుపో నగవో నయమో ప్రియమో
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమో
వెనుతగిలేవు గోవిందుడా
చ : మంకో మరులో మదమో ముదమో
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుగనగూడితి
వేంకటగిరి గోవిందుడా
చ : కపటమో నిజమో కరుణయో కోపమో
ఉపచారమో ఉపతాపమో
నిపుణత తనపై నెయ్యమే సేసేవు
విపరీతము గోవిందుడా
చ : ననుపో నగవో నయమో ప్రియమో
చనవో చలమో సరసమో
కనుకూరిమియో గయ్యాళితనమో
వెనుతగిలేవు గోవిందుడా
చ : మంకో మరులో మదమో ముదమో
జంకో లంకో జగడమో
శంకలేక నను సరుగనగూడితి
వేంకటగిరి గోవిందుడా
Listen to Audio

0 comments:
Post a Comment