16. యఙ్ఞమూర్తి యఙ్ఞకర్త...

ప : యఙ్ఞమూర్తి యఙ్ఞకర్త యఙ్ఞభోక్తవు ఇన్నిటాను
యఙ్ఞాధి ఫలరూపము ఇటునీవై ఉండవే

చ : పరికించ జీవులకు ప్రాణమువైన నీకు
నిరతి ప్రాణప్రతిష్ఠ మేముసేసేమా
మరిగి మా పూజలంది మమ్ముకాచెడి కొరకు
హరి నీ మూర్తి ప్రాణమావహించవే

చ : జగతికి నీ పాదజలమే సంప్రోక్షణ
జిగినీకు సంప్రోక్షణ సేయువారమా
పగటున ననునేడు పావనము సేయుటకు
అగు పుణ్యతీర్ధముల అభిషేకమందవే

చ : వేదములు తెచ్చిన శ్రీ వేంకటేశ మేమునీకు
వేదమంత్రముల పూజావిధి సేసేమా
ఈదశ మీదాసులము అయినమమ్ము కాచుటకు
వేదమూర్తివై ఇందే విచ్చేసివుండవే



Listen to Audio

0 comments: