15. మర్ద మర్ద మమ బంధానీ...

ప : మర్ద మర్ద మమ బంధానీ
దుర్దాంత మహా దురితానీ

చ : చక్రాయుధ రవి శతతేజోంచిత
సక్రోధ సహస్ర ప్రముఖ
విక్రమక్రమ విస్ఫులింగకణ
నక్రహరణ హరి నవ్యకరాంక

చ : కలిత సుదర్శన కఠిన విదారణ
కులిశకోటి భవ ఘోషణా
ప్రళయానల సంభ్రమ విభ్రమకర
రళితదైత్యగళ రక్తవికిరణా

చ : హితకర శ్రీవేంకటేశప్రయుక్త
సతతపరాక్రమ జయంకర
చతురోహంతే శరణం గతోస్మి
ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష


0 comments: