13. జగడపు చనవుల జాజర...
ప : జగడపు చనవుల జాజర
సగిణల మంచపు జాజర
సగిణల మంచపు జాజర
చ : మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన బుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర
చ : భారపు కుచముల పైపైకడు
సింగారము నెరపెటి గందవొడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు జల్లేరు జాజర
సారెకు జల్లేరు జాజర
చ : బింకపు కూటమి పెనగెటి చమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర

0 comments:
Post a Comment