11. వేదములే నీ నివాసమట

ప : వేదములే నీ నివాసమట విమలనారసింహ
నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ

చ : ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన
నారాయణ రమాథినాయక నగధర నరసింహ
నీరూపమ్ము ఇంత అంతయని నిజము తెలియరాదు
ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ

చ : గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ
శ్రీవల్లభ పురాణపురుష శిఖనఖ నరసింహ
దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు
భావింపగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ

చ : దాసపరికర సులభ తపన చంద్రనేత్ర
వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ
భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన
ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ


Listen to Audio

0 comments: