47. రమణుడు పిలిచీని రావే
(ramaNuDu pilicIni rAvE)

ప : రమణుడు పిలిచీని రావే చెలియ నీవు
తమకమెవలెగాక తరుణులకు

చ : తలపుకొలది మంచితనమే వలెగాక
చలపాది తనమేల సరసులకు
వెలలేని మాటల వినయమే వలెగాక
సొలపు వెంగ్యములేల సుగుణలకు

చ : కోటిసేయ వలపులు కుమ్మరించ వలెగాక
నీటుతో గర్వములేల నేర్పరులకు
మేటి సరసములాడి మెరయగ వలెగాక
జూటుతనములేటికి సొంపు దొరలకు

చ : నయగారి తనమున నవ్వు నవ్వవలెగాక
రయమున దాగనేల రసికులకు
నియతి నన్నేలినాడు నేడు శ్రీవేంకటేశుడు
క్రియతో వేసరమేల కిమ్ముల దేవుళ్ళకు

రమణుడు పిలిచీని రావే

Lyrics In English:

pa : ramaNuDu pilicIni rAvE celiya nIvu
tamakamevalegAka taruNulaku

ca : talapukoladi maMcitanamE valegAka
calapAdi tanamEla sarasulaku
velalEni mATala vinayamE valegAka
solapu veMgyamulEla suguNalaku

ca : kOTisEya valapulu kummariMca valegAka
nITutO garvamulEla nErparulaku
mETi sarasamulADi merayaga valegAka
jUTutanamulETiki soMpu doralaku

ca : nayagAri tanamuna navvu navvavalegAka
rayamuna dAganEla rasikulaku
niyati nannElinADu nEDu SrIvEMkaTESuDu
kriyatO vEsaramEla kimmula dEvuLLaku